Site icon NTV Telugu

Priyanka Chopra: బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణించడం కష్టం..

Priyanka Chopra

Priyanka Chopra

మనకు తెలిసి ఇండస్ట్రీలో రాణించాలి అంటే ముందు అవకాశాలు రావాలి.. అవకాశాలు రావాలి అంటే బ్యాగ్రౌండ్ ఉండాలి. కానీ కొంత మంది నటీనటులకు ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న గుర్తింపు సంపాదించుకోవడం చాలా కష్టం. కానీ మరి కొంత మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీని ఏలుతారు అది వారి లక్. ప్రజంట్ ఈ విషయం మీద తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇంట్రస్టింగ్ స్టెట్‌మెంట్ పాస్ చేసింది.

Also Read : Pawan Kalyan : వకీల్ సాబ్ నుంచి ఓజీ వరకు..పవన్ స్పీడ్ చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే

2000లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా, క్రమంగా స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగి.. ఇప్పుడు హాలీవుడ్ వరకు ఊపేస్తోంది. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించడానికి ఉన్న కారణాన్ని వెల్లడించారు..ప్రియాంక మాట్లాడుతూ “మిస్ వరల్డ్‌ గెలిచిన తర్వాత నాకు హిందీ, తమిళ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ రెండేళ్లకే బాలీవుడ్‌ పరిస్థితులు అర్థమయింది. సినీ బ్యాగ్రౌండ్ లేని వారిని ఎంత తక్కువగా చూస్తారో తెలిసింది. ఇండస్ట్రీలో తరతరాలుగా ఉన్నవారే ఎక్కువ అవకాశాలు పొందుతారు. అలాంటప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్లు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ నేను కష్టపడి ఆఫర్లు దక్కించుకున్నాను. పట్టుదలతో పని చేయడం నా అలవాటు. కానీ నేను ఎదుర్కొన్న కష్టాలు ఇతరులు ఎదుర్కో కూడదని అనిపించింది. అందుకే 2015లో ‘పర్పుల్ పెబుల్ పిక్చర్స్’ను ప్రారంభించాను. కొత్తగా వచ్చిన వారికి ప్రోత్సాహం చేయడమే నా లక్ష్యం” అని అన్నారు. కాగా ఆమె నిర్మాణ సంస్థలో 2016లో భోజ్‌పురి సినిమాతో తొలి ప్రాజెక్ట్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత పలు భాషల్లో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.

Exit mobile version