యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో ప్రిన్స్ మాట్లాడుతూ “కలి” సినిమా అనౌన్స్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ ఏమైనా లవ్, రొమాంటిక్ మూవీస్ చేసుకోవచ్చు కదా అని అన్నారు. కానీ ఈ సినిమా చేయడానికి కొన్ని ఎమోషన్స్ కారణం అయ్యాయి.
Priyanka Mohan: తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్ ప్రియాంక మోహన్
నేను ఇష్టపడే హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఎంతోకాలం బాధించింది. అలాగే నా క్లోజ్ ఫ్రెండ్, నా రూమ్మేట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు ఎంతో బాధ పడ్డాను. ఈ ఆత్మహత్యల నివారణకు ఏదో ఒకటి నా వంతు ప్రయత్నంగా చేయాలని అనిపించింది. ఆ టైమ్ లో “కలి” కథ నా దగ్గరకు వచ్చింది. ఇది తప్పకుండా చేయాలని అనుకున్నా. “కలి” సినిమా మిమ్మల్ని బాధ పెట్టేలా ఉండదు. ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మంచి మ్యూజిక్ ఉంటుంది. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి. “కలి” సినిమా చూసేందుకు ఈ నెల 4వ తేదీన థియేటర్ లో కలుద్దాం. అన్నారు.