దర్శకేంద్రుడు ఇటీవలే పెళ్లిసందడి చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ‘పెళ్లి సందడి’కి అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 28న ఉదయం 11 గంటలకు ‘పెళ్లి సందD’ నుంచి ‘ప్రేమంటే ఏంటి’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. కాగా 1996 లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళి సందడి’ చిత్రం శ్రీకాంత్ కెరీయర్ లో ఓ మైలురాయిగా నిలిచిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 28న ‘పెళ్లి సందD’ ఫస్ట్ సాంగ్
