టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకులో ప్రశాంత్ వర్శ ఒకరు. ‘హనుమాన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్ని తాజాగా తన నూతన చిత్రం ‘మహాకాళి’ ను ప్రారంభించారు. PVCU (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) నుంచి వస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఇవాళ అధికారికంగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. “విశ్వంలో అత్యంత క్రూరమైన సూపర్ హీరో” అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు.
Also Read : Ram Charan : ‘పెద్ది’ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన రామ్ చరణ్
అయితే ‘హను-మాన్’ సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం మనకు తెలిసిందే. దీంతో ఇక తన సినిమాటిక్ యూనివర్స్‌లో చాలా సినిమాలు ఉండబోతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే వెల్లడించారు. ఇందులో భాగంగా ‘మహాకాళి’ సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. పూజా కొల్లూరు డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా కథ బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా రూపొందుతోంది. మతపరమైన గంభీరత, స్థానిక పౌరాణిక చరిత్రలకు అనుగుణంగా తెరకెక్కిస్తున్నారట. అయితే, ఈ సినిమాలో లీడ్ రోల్‌లో ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రానప్పటికి, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా విలన్‌గా నటిస్తాడనే టాక్ మాత్రం వినిపిస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయక తప్పదు.
