NTV Telugu Site icon

Prakash Raj: 1000 మంది ఆర్టిస్టులున్న సెట్ నుంచి ప్రకాష్ రాజ్ మిస్సింగ్.. కోటి రూపాయల నష్టం!

Prakash Raj

Prakash Raj

Prakash Raj Allegedly Left A Set Without Informing led 1 Crore Rupees Loss: సౌత్ సినిమా నటుడిగా, నెగిటివ్ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు తెర మీదకు వచ్చాయి. ప్రకాష్ రాజ్ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా సెట్ నుండి వెళ్లిపోయారని చెబుతున్నారు. సినీ నిర్మాత వినోద్ కుమార్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పై ఈ పెద్ద ఆరోపణలు చేశారు. ప్రకాష్ రాజ్ ఇటీవల అక్టోబర్ 5న ఉదయనిధి, అతని తండ్రి, తమిళ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసి, ‘డిప్యూటీ సీఎంతో… #జస్ట్ ఆస్కింగ్’ అని రాశారు. ఉదయనిధి ఇటీవలే డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఈ పోస్ట్ తర్వాత, నిర్మాత వినోద్ రీట్వీట్ చేస్తూ ప్రకాష్ వృత్తి ధర్మం లేనివాడని ఆరోపించారు. అయితే ఏ సినిమా షూటింగ్ చేస్తున్నారో చెప్పలేదు. కానీ నటుడి అనైతిక వైఖరి వల్ల తనకు కోటి రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ‘మీతో పాటు కూర్చున్న మిగతా ముగ్గురు వ్యక్తులు ఎన్నికల్లో గెలిచారు, కానీ మీరు డిపాజిట్ కోల్పోయారు, అదే తేడా.

Akkineni Nagarjuna: రేపు కోర్టుకు హాజరు కానున్న హీరో నాగార్జున

మీరు సమాచారం ఇవ్వకుండా కారవాన్ నుండి అదృశ్యమై నా షూటింగ్ సెట్‌కి కోటి రూపాయల నష్టం కలిగించారు. కారణం ఏమిటి? #జస్ట్ ఆస్కింగ్!!! మీరు నాకు ఫోన్ చేస్తానని చెప్పారు, కానీ మీరు చేయలేదు!’ ఇది ఇటీవల సెప్టెంబర్ 30న జరిగిన సంఘటన అంటూ వినోద్ మరో ట్వీట్ చేశారు. ‘ఇది 30 సెప్టెంబర్ 2024న జరిగింది. తారాగణం, సిబ్బంది అంతా షాక్ అయ్యారు. దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులున్నారు. ఇది అతనికి 4 రోజుల షెడ్యూల్. మరొక ప్రొడక్షన్ నుండి కాల్ రావడంతో అతను కారవాన్ నుండి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియడం లేదు! దీంతో మేము షెడ్యూల్‌ను ఆపవలసి వచ్చింది. ఆ కారణంగా మేము చాలా బాధపడ్డాము అని రాసుకొచ్చారు. వినోద్ మరియు ప్రకాష్ 2021 తమిళ చిత్రం ‘ఎనిమీ’లో కలిసి పనిచేశారు. ఈ చిత్రంలో విశాల్‌, మిర్నాళిని రవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఆరోపణలపై ప్రకాష్ ఇంకా స్పందించలేదు.

Show comments