Site icon NTV Telugu

OTT Update: రెండు ఓటీటీలలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్

Prabhutva Junior Kalasala

Prabhutva Junior Kalasala

Prabuthwa Junior Kalashala in AHA and Prime Video: ప్రణవ్ ప్రీతమ్, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఓక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా భువన్ రెడ్డి కొవ్వూరిఈ సినిమాని నిర్మించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల మనసును దోచుకోగా థియేటర్లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వచ్చే వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులోకి రాబోతోంది.

రచయిత సాయి మాధవ్ బుర్రా సంచలనం.. తెలుగువారికి మినహాయించి వారందరికి పాదాభివందనం

అంతా కొత్త వారితో చేసిన ఈ చిన్న సినిమాకి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం ఆకట్టుకు ఆహాలో ఈ మూవీ ట్రెండ్ అవుతోంది అని మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రం ప్రస్తుతం ఆహాతో పాటుగా యూఎస్ ఆడియెన్స్ కోసం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక వచ్చే వారం నుంచి ఇండియన్ ఆడియెన్స్ కోసం ఆహాతో పాటుగా అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు. ప్రతీ మనిషికి తొలి ప్రేమ ఎంతో మధురం, పదిలంగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన తొలి ప్రేమను ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో చూపించారు. ఇంటర్మీడియట్ రోజులు.. తొలి ప్రేమ.. విరహ వేదనలు.. ఇలా అన్ని అంశాలతో కుర్రకారుని కట్టి పడేసేలా ఓ అందమైన ప్రేమ కావ్యంగా చూపించారు.

Exit mobile version