Site icon NTV Telugu

ఓటీటీ బాట పడుతున్న ప్రభుదేవా 50వ చిత్రం!

Prabhu Deva's 'Pon Manickavel' to release on OTT?

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ప్రస్తుతం ‘పొన్ మాణిక్యవేల్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. నటుడిగా ఇది అతనికి 50వ సినిమా. నివేదా పేతురాజ్ హీరోయిన్. ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వంలో నిమీచంద్, హరీష్‌ ఈ సినిమాను ప్రొడ్యూసర్ చేశారు. తన కెరీర్ లోనే ప్రభుదేవా తొలిసారి పోలీస్‌ ఆఫీసర్ పాత్ర చేసిన ఈ మూవీని గత యేడాది ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత మార్చి 6కు వాయిదా వేశారు. అప్పుడూ విడుదల కాలేదు. ఆ పైన కరోనా మొదలు కావడంతో సినిమా విడుదల నిరవధికంగా వాయిదా పడిపోయింది.

Read Also : బన్నీకి ఝలక్ ఇచ్చిన చెర్రీ సినిమా!

జె. మహేంద్రన్, సురేశ్ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డి. ఇమ్మాన్ సంగీతం అందించారు. ప్రభుదేవా సినిమాకు ఇమ్మాన్ మ్యూజిక్ ఇవ్వడం ఇదే మొదటిసారి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేయబోతోందట. అతి త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మూవీని స్ట్రీమింగ్ చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని అతి త్వరలోనే ఇస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

Exit mobile version