Rajasab : ప్రభాస్ ‘రాజసాబ్’ నుంచి సాంగ్ వీడియో లీక్.. మాస్ లుక్‌లో ప్రభాస్

Prabas Rajasab

Prabas Rajasab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కల్కి సూపర్ హిట్ తర్వాత చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మన డార్లింగ్. కాగా ఈ మూవీ లిస్ట్ లో  రాజ సాబ్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్ర బృందం కొన్ని పోస్టర్లు, గ్లింప్స్ విడుదల చేసి ఆసక్తిని పెంచింది. అయితే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఓ కొత్త వీడియో ట్రెండింగ్ అవుతుంది. ఇందులో ప్రభాస్ మాస్ లుక్ లో తలపాక.. రంగు రంగుల డ్రెస్సింగ్ తో స్టెప్ లేస్తు కనిపించారు. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా  వైరల్ అవుతుంది.