Site icon NTV Telugu

Raja Saab: రెబల్ ఫాన్స్ కి ముందుగానే పండుగ!

The Raja Saab Release Date

The Raja Saab Release Date

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్ర ట్రైలర్ ను ఈ నెల 29వ తేదీ‌ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మోస్ట్ అవేటెడ్ అనౌన్స్ మెంట్ తో రెబెల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్, సంజయ్ దత్ కాంబో స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది. “రాజా సాబ్” ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Also Read:Kantara V/S Bollywood : కాంతార ప్రీక్వెల్ వర్సెస్ బాలీవుడ్.. థియేటర్ల షేరింగ్‌పై హీట్‌!

“రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. డైరెక్టర్ మారుతి “రాజా సాబ్” సినిమాతో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నారు అని టీం చెబుతోంది.

Exit mobile version