సినీ నటుడు గతంలో వైసిపికి మద్దతుగా ప్రచారం చేసి ప్రభుత్వ హయాంలో ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్గా కూడా వ్యవహరించిన పోసాని కృష్ణ మురళి ప్రస్తుతానికి అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయన మీద ఏపీ వ్యాప్తంగా పలు కేసులు నమోదు అవ్వగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ల నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కి తరలించారు. ప్రస్తుతానికి ఆయన జైలలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మధ్యలో అనారోగ్యం పాలైనట్టు పోలీసుల దృష్టికి తీసుకు రావడంతో ఆయనను చెక్ అప్ నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు.
NTR NEEL: ‘ఎన్టీఆర్’ డ్రాగన్ ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ
ఆ తర్వాత ఆయనను మళ్ళీ జైలుకు తరలించారు. ఇక మరోపక్క పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ పై విచారణ ఈ నెల 5కు వాయిదా వేసింది కోర్టు… పోసాని బెయిల్ పిటిషన్ పై కూడా విచారణను 5కు వాయిదా వేశారు. కాసేపట్లో నరసరావు పేట పోలీస్ స్టేషన్ కు పోసాని కృష్ణ మురళిని పోలీసులు తీసుకు రానున్నారు.. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను పీటీ వారెంట్ పై నరసరావుపేట పిఎస్ కు తరలిస్తున్నారు.