NTV Telugu Site icon

Posani Krihsna Murali : కొండా సురేఖ – అక్కినేని వివాదం.. పోసాని కృష్ణమురళి షాకింగ్ కామెంట్స్

POsani

Posani Krihsna Murali Shocking Comments on Konda Surekha – Akkineni issue: అక్కినేని కుటుంబం vs కొండా సురేఖ వివాదం గురించి పోసాని కృష్ణమురళి స్పందించారు. గతంలో పవన్ మీద వాఖ్యలు చేస్తే స్పందించని నోర్లు అని నాకు ఆపాదిస్తున్నారని, నిన్న ఒకడు నన్ను కత్తి తో పొడుస్తా అన్నాడని అన్నారు. నేను పవన్ ను గతంలో తిట్టినట్లు చూపిస్తే నేను లైవ్ లో గొంతు కోసుకుని చనిపోతాను పోసాని కృష్ణమురళి అన్నారు. గతంలో పవన్, చంద్ర బాబు కుటుంబం తిట్టుకున్నారు, నా కుటుంబాన్ని పవన్ అభిమానులే అమ్మనా బూతులు తిట్టించారని అన్నారు. అప్పుడు నన్ను నా కుటుంబాన్ని తిట్టినందుకు ఎవరు నాకు మద్దతు తెలపలేదు.

Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై మరో ఫిర్యాదు

సినిమా ఇండస్ట్రీ పరువు కోసం ప్రతిసారి నేను ముందుకు వచ్చా,సినిమా కళామతల్లి నా కన్న తల్లి. న్యాయం వైపే ఉంటాను ప్రతిసారి అని అన్నారు. నాగార్జున కుటుంబం మీద జరిగిన మాటల దాడిని సినిమా ఇండస్ట్రీ లో ప్రతి ఒక్కరు ఖండించారు, కానీ బాలకృష్ణ కుటుంబం ఖండించలేదు అని పోసాని అన్నారు. ఆడపిల్లలకు కడుపు ఐనా చేయాలి ముద్దు ఐనా పెట్టాలి అని చెప్పిన బాలకృష్ణ నుండి క్షమాపణ కోరుకోగలమా ? అని ప్రశ్నించిన ఆయన ఇప్పటికైనా కొండా సురేఖ గారు జెంటిల్ మెన్ నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Show comments