Site icon NTV Telugu

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న “బీస్ట్” బ్యూటీ

Pooja Hegde wraps up Beast first schedule

తలపతి విజయ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “బీస్ట్‌” చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజాహెగ్డే రొమాన్స్ చేయనుంది. ఫస్ట్ షెడ్యూల్ కోసం ఇటీవల చెన్నైలో సందడి చేసిన పూజా తాజాగా తిరిగి ముంబై చేరుకుందని తెలుస్తోంది. “బీస్ట్” ఫస్ట్ షెడ్యూల్ లో పూజాహెగ్డే తనవంతు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న రెండవ షెడ్యూల్ లో పూజా పాల్గొననుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో దర్శకుడు హీరోకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

Read Also : రాజమౌళి చేతుల మీదుగా “ఛత్రపతి” హిందీ రీమేక్ లాంచ్

ఇప్పటివరకు చెన్నైలో జరిగిన షెడ్యూల్ లో దర్శకుడు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను, ఒక పాటను హీరోహీరోయిన్లపై చిత్రీకరించారు. కాగా ఇటీవల చిత్రం నుంచి విడుదలైన “బీస్ట్” ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న థర్డ్ లుక్ విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. “తుపాకీ” లాగే ఈ చిత్రం కూడా దేశభక్తి భావోద్వేగం గల నేపథ్యంతో రూపొందుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version