PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్

Peddi Day 1

Peddi Day 1

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవైటేడ్ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసేలా ఉంది. గత కొద్ది రోజులుగా బాక్సాఫీస్ దగ్గర పెద్ద చిత్రాలు లేని లోటుని పెద్ది తీర్చేలా ఉంది. అనుకున్నట్టే.. మొదటి రోజు సాలిడ్ స్టార్ట్ అందుకుంది పెద్ది. తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ‘పెద్ది’ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135.36 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ‘బాక్సాఫీస్ ఛాంపియన్’గా నిలిచింది.
రామ్ చరణ్ మాస్ క్రేజ్, బుచ్చిబాబు టేకింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించడంతో తొలిరోజు ఈ స్థాయి వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ ఛాంపియన్ – పెద్ది.. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 135.36 కోట్లకు పైగా గ్రాస్” రాబట్టిందంటూ.. మేకర్స్ అఫీషియల్ పోస్టర్‌ విడుదల చేశారు. దీంతో రామ్ చరణ్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా పెద్ది నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మొదటి రోజు వసూళ్లలో వంద కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిన చెర్రీ.. ఆ తర్వాత గేమ్ ఛేంజర్‌ నిరాశ పరిచినా ఇప్పుడు పెద్దితో భారీ వసూళ్లు రాబట్టి చరణ్ క్రేజ్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. మొదటి రోజే ఈ రేంజ్ కలెక్షన్ల రావడంతో పెద్దిగాడి ఆటకు లాంగ్ రన్‌లో మరిన్ని ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఏదేమైనా.. పెద్దిగాడు బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఉన్నాడు.