Site icon NTV Telugu

క్రిష్ చేతుల మీదుగా “పీనట్ డైమండ్” ట్రైలర్

Peanut Diamond trailer will be released by Dynamic Director Krish

అభినవ్ సర్దార్ పటేల్, రామ్ కార్తీక్, చాందిని తమిళరసన్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘పీనట్ డైమండ్’. ఈ చిత్రంతో వెంకటేష్ త్రిపర్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎఎస్పి మీడియా హౌస్, జీవీ ఐడియాస్ బ్యానర్ లపై అభినవ్ సర్దార్, వెంకటేష్ త్రిపర్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రేపు “పీనట్ డైమండ్” ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా రేపు ఉదయం 11 గంటల 20 నిమిషాలకు “పీనట్ డైమండ్” ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. మేకర్స్ తాజా ప్రకటనతో ఏ సైన్స్ ఫిక్షన్ మూవీ ట్రైలర్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి మొదలైంది.

Exit mobile version