Site icon NTV Telugu

Pawankalyan : వీరమల్లు పై మండి పడుతున్న సింగిల్ స్క్రీన్స్‌ యాజమన్యం..

‘harihara Veeramallu’

‘harihara Veeramallu’

పవన్‌ కల్యాణ్‌ నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హరిహర వీరమల్లు’. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ, తొలి భాగం జూన్ 12న రిలీజ్ కానున్నట్లు నిర్మాతలు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ, ఈసారి కూడా కష్టమేనని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంపై డిస్ట్రిబ్యూటర్లు భారీ నమ్మకాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఈ సినిమాతో భారీ లాభాలు వస్తాయని ఆశించారు. కానీ అందరీ ఆశలపై నీళ్లు జల్లుతూ ఈ మూవీ మేకర్స్ అన్నంతపని చేశారు.. రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు.

Also Read : Balakrishna : ‘అఖండ 2’ బిగ్ అప్డేట్‌కు ముహూర్తం ఫిక్స్..

దీంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సినీ రంగానికి చెందిన పలువురు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ శ్రీధర్ కూడా ఈ చిత్ర వివాదంపై కామెంట్స్ చేశారు.. ‘వాయిదా అనే ఇష్యూ క్రియేట్ చేసింది ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇద్దరు డైరెక్టర్స్ మాత్రమే. ‘హరిహర వీరమల్లు’ సినిమా ఉందని ప్రతి థియేటర్ కాలి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ నెల అంతా పోయినట్లే. ఈ ఏడాదిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘కోర్టు’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలు మాత్రమే హిట్లుగా నిలిచాయి. హీరోలకు స్టార్‌డమ్ వచ్చిందే సింగిల్ స్క్రీన్స్ వల్ల.. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్‌ను వారు పట్టించుకోవడం లేదు’ అని ఆయన మండిపడ్డారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version