Site icon NTV Telugu

Pawankalyan: హరిహర వీరమల్లు – నెక్ట్స్ సాంగ్ కి డేట్ ఫిక్స్!

Hari Hara Viramalu

Hari Hara Viramalu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ హైప్ నెలకొని ఉన్నప్పటికీ, ప్రమోషన్ల పరంగా చిత్ర బృందం కాస్త నెమ్మదిగానే సాగుతోంది. అయితే ఇప్పుడు ఫాన్స్ కోసం లేటెస్ట్ మ్యూజిక్ అప్డేట్ వచ్చేసింది.ఇప్పటికే సినిమా నుంచి నాలుగు పాటలు విడుదల కాగా, ఇప్పుడు ఐదో పాటపై ఫోకస్ పెట్టారు.

Also Read : Kiara Advani : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కియారా..

మ్యూజిక్ లవర్స్ కోరుకున్నా ఆ నెక్స్ట్ సాంగ్‌ను ఈ జూలై 18 లేదా 19న విడుదల చేయాలని చిత్ర బృందం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ పాటకు సంగీతాన్ని అందించింది ఎం ఎం కీరవాణి, కాబట్టి సంగీత ప్రమేయం మరింత స్పెషల్ గా ఉండబోతుందని టాక్. ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం నిర్మిస్తుండగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోనుంది. మొత్తానికి, జూలై 24న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇక మ్యూజిక్, ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ లాంటి ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలోనే మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Exit mobile version