NTV Telugu Site icon

Paruchuri Venkateswara Rao : ప్రేక్షకులు మెచ్చిన మిస్టర్ సెలెబ్రిటీ

Mr Celrbrity

Mr Celrbrity

పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా అక్టోబర్ 4న మిస్టర్ సెలెబ్రిటీ అనే చిత్రం వచ్చింది.   రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో శనివారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘మా మనవడు హీరోగా వచ్చిన మిస్టర్ సెలెబ్రిటీ చిత్రాన్ని ఆడియెన్స్ అద్భుతంగా ఆదరిస్తున్నారు. మేం ఎన్నో చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే అందించాం. కానీ ఇప్పుడు వస్తున్న వారు కథ, కథనం, దర్శకత్వం, మాటలు ఇలా అన్నీ రాసుకుంటున్నారు. మిస్టర్ సెలెబ్రిటీ చిత్రానికి చందిన రవి కిషోర్ అన్నీ తానై ముందుండి తీసుకెళ్లాడు. ఇంకా చూడని వాళ్లంతా కూడా సినిమాను థియేటర్లో చూడండి’ అని అన్నారు.

బి. గోపాల్ మాట్లాడుతూ.. ‘నాకు పరుచూరి బ్రదర్స్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంద్ర కోసం పగలూరాత్రి తేడా లేకుండా కలిసి పని చేశాం. మా చిన్నబ్బాయ్.. పెద్దబ్బాయ్‌లంటే అందరికీ ఇష్టమే. వాళ్లు నాకు లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు వారి మనవడు సుదర్శన్ హీరోగా వచ్చాడు. మిస్టర్ సెలెబ్రిటీ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. నేను కూడా సుదర్శన్‌తో ఓ సినిమా చేస్తాను.

రఘు బాబు మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీని జనాలు ఆదరించారు. పెద్ద హిట్‌ను అందించారు. సుదర్శన్ బాబు పరుచూరి లెగసీని ముందుకు తీసుకెళ్తాడు. డెబ్యూతోనే మంచి విజయాన్ని సుదర్శన్ అందుకున్నాడు.

దర్శకుడు చందిన రవి కిషోర్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీకి అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ వస్తోంది. కథ విన్న వెంటనే బాగుందని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. స్క్రిప్ట్ మీద ఆయన చేయి పడింది కాబట్టే ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అయింది. నేను ఈ రోజు ఇక్కడి వరకు వచ్చానంటే పరుచూరి ఫ్యామిలీయే కారణం. మా హీరో సుదర్శన్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ చిత్రానికి ఇంత గొప్ప ప్రమోషన్స్ దక్కాయి.