Parnashala: ‘జిమ్ జిమ్ తార’తో పర్ణశాల టీమ్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్..!

Parnashala

Parnashala

Parnashala: హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ‘పర్ణశాల’ చిత్ర బృందం పాటను జనాల్లోకి తీసుకెళ్లేందుకు వేసిన ప్లాన్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఒక సాంగ్ రీల్స్‌లో ట్రెండ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో రీల్స్ చేయించి వైరల్ చేయాలన్నా కనీసం ఇంత బడ్జెట్ అనుకొని ఖర్చు కేటాయించాల్సిందే. కానీ కొత్త ప్రొడక్షన్ కావడంతో మొదటి నుంచే వినూత్న మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు మేకర్స్. గతంలోనే లక్ష్మీదేవితో ఈ సాంగ్‌ని పాడించిన చిత్ర బృందం, ఫస్ట్ ఈ పాట ద్వారానే సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని భావించింది. అనుకున్నదే తడవుగా, ఈ పాటకు సంబంధించి సోషల్ మీడియాలో చేసిన ఒక్క ప్రమోషనల్ మూవ్‌తో యావత్ ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. పీఆర్ టీమ్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు లేకుండానే “జిమ్ జిమ్ తార” సాంగ్ ప్రతి మొబైల్ స్క్రీన్‌ను దాటుకుని గ్రౌండ్ లెవెల్ శ్రోతల నాలుకలపై నానేలా మారింది. తాము ఆశించిన దానికంటే రెట్టింపు రిజల్ట్ ఇస్తూ పాట విపరీతంగా జనాల్లోకి చొచ్చుకుపోయింది.

సినిమా రిలీజ్ అయ్యే టైంకి పాట హిట్ అయితే బిజినెస్ పరంగా వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. ప్రమోషన్ బడ్జెట్ భారీగా ఆదా అవ్వడమే కాకుండా, సినిమా మార్కెట్, ఓటీటీ, ఆడియో రైట్స్ బిజినెస్‌కు ఈ హైప్ తిరుగులేని బలాన్నిస్తోంది. మార్కెట్లోకి వెళ్లడానికి వేలల్లో కాకుండా లక్షల్లో ప్రమోషన్లు చేయాల్సి వస్తున్న ఈ తరుణంలో.. పర్ణశాల టీమ్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ చిన్న సినిమాలకు ఒక గైడ్‌లా మారిందని అంటున్నారు. లక్షల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్‌ను కేవలం ఒకే ఒక్క క్రియేటివ్ ఐడియాతో సేవ్ చేసి, సినిమాను జనాల్లో రిజిస్టర్ చేయడంలో పర్ణశాల మేకర్స్ వంద శాతం సక్సెస్ అయ్యారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న నిర్మాతలు ఇలాంటి వినూత్నమైన కాన్సెప్టులతో ముందుకు వస్తే, బడ్జెట్ భారం తగ్గడమే కాకుండా సినిమా బిజినెస్ కూడా ఈజీగా పరుగులు పెడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.