తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న హీరో నాని, ఇతర భాషల్లో మాత్రం మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. నిజానికి ఆయన శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి ఇతర భాషల్లో మార్కెట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఎందుకో తెలియదు కానీ ఆ ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు. ఇటీవల హిట్ 3 ప్రమోషన్స్ కూడా ముంబై, చెన్నై, బెంగళూరు వచ్చి అంటూ తెలుగు రాష్ట్రాల కంటే కాస్త ఎక్కువగానే బయట ప్రమోషన్స్ చేసి వచ్చాడు. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు చూపించిన అంత ప్రేమ బయటి ఆడియన్స్ మాత్రం ఎందుకో చూపించలేదు.
Read more: Peddi: సైలెంటుగా ‘పెద్ది’ షూట్.. ఎక్కడంటే?
అందుకే హిందీలో ఫస్ట్ వీకెండ్ నెట్ కలెక్షన్స్ కోటి లోపే ఉన్నాయి. అలాగే తమిళ, మలయాళ, కన్నడ భాషల కలెక్షన్స్ అన్నీ కలిపినా కూడా కోటి లోపే ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులు మాత్రం దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ ఇస్తే, ఇతర భాషల ప్రేక్షకులు మాత్రం ఎందుకు హిట్ 3 మీద పెద్దగా ఆసక్తి కనబరచలేదు? నిజానికి తమిళంలో రెట్రోలాంటి సినిమాతో పాటు హిందీలో Raid 2 లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని ఆ సినిమాలు ఏమైనా అద్భుతంగా ఆడాయా? అంటే, వాటి పరిస్థితి కూడా బాగోలేదు. కానీ ఆయా భాషల ప్రేక్షకులు కూడా నాని సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నాని చేసిన ఈ ప్రయత్నం కూడా పాన్-ఇండియా మార్కెట్‌లో వృథా అయినట్లే చెప్పొచ్చు.
