Site icon NTV Telugu

Sunitha Krishnan: బాలీవుడ్ వాళ్లు బయోపిక్ రెడీ చేసినా నేను నో చెప్పా!

Sunitha Krishnan

Sunitha Krishnan

Padma Shri Awardee Dr.Sunitha Krishnan ‘I Am What I Am’ Book Launch: ప్రముఖ సంఘసేవకురాలు, ప్రజ్వల సేవాసంస్థ నిర్వాహకురాలు డా. సునీతా కృష్ణన్ రాసిన ‘I am what I am’ పుస్తకాన్ని తెలంగాణ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. బేగంపేటలోని పార్క్ గ్రీన్ హోటల్‌లో శుక్రవారం జరిగిన పుస్తకావిష్కరణ సభకు మంత్రి సీతక్క, అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘హ్యూమన్ ట్రాఫికింగ్‌లో చిక్కుకున్న అమ్మయిలను కాపాడిన సునీతా కృష్ణన్ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయం. అత్యాచార బాధితులు కుంగిపోకుండా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపడం సునీతా కృష్ణన్ గొప్పతనం. సునీతా కృష్ణన్ ఒక సర్వైవరే కాదు ఒక సేవియర్. తన గాయాలను ఉద్యమాలుగా మలచిన సునీతా కృష్ణన్ నాకు కూడా స్ఫూర్తే. దాడులకు వెరవకుండా ఎందరో అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి కాపాడింది. బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడిన ఆడపిల్లలను రక్షించి వారికి తిరిగి మంచి జీవితాల్ని ప్రసాదించడం సునీతా కృష్ణన్ గొప్పతనం. అందుకే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలకు సునీతా కృష్ణన్ ఒక రోల్ మోడల్. ఆమె పోరాటాలకు, కృషికి ప్రభుత్వం ఎల్లపుడూ అండగా ఉంటుంది. సునీతా కృష్ణన్ పోరాటంలో భాగస్వామ్యులైన అందరికీ ప్రభుత్వం తరఫున అభినందనలు’ అని అన్నారు.

Sidhu Jonnalagadda : అప్పుడు కనీకనిపించని పాత్ర.. ఇప్పుడేమో అతిధి పాత్ర!

సునీతా కృష్ణన్ మాట్లాడుతూ.. ‘నా దగ్గర ఒక్క రూపాయి లేనప్పుడు నాకు గ్రీన్ పార్క్ హోటల్ ఎంతో సాయం చేసింది. ఆ సెంటిమెంట్ వల్లే ఈ రోజు ఇక్కడ బుక్‌ను రిలీజ్ చేయాలని అనుకున్నాను. నా బుక్ లాంచింగ్‌కు వచ్చినందుకు మంత్రి సీతక్కకి థాంక్స్. ఆమెను ఎప్పటి నుంచో కలవాలని కోరుకున్నా, ఆమె పోరాట స్పూర్తి, పడిన కష్టాలు నాకు తెలుసు. ఆమె మనకు మంత్రి కావడం ఆనందంగా ఉంది. నా మీద సినిమా తీయాలని బాలీవుడ్ వాళ్లు బయోపిక్ రెడీ చేసి నా పర్మిషన్ అడిగారు. కానీ నేను నో చెప్పాను. వాళ్లు యూట్యూబ్, వికీపీడియా, గూగుల్ నుంచి తీసుకున్నారట. నా కథను నేనే రాసుకోవాలని అనుకుని అప్పుడే నిర్ణయించుకున్నాను. 13 రోజుల్లోనే ఈ బుక్ రాసేసి బీయింగ్ సర్వైర్ అని పేరు పెట్టాను. కానీ అందరూ కూడా నువ్వు సర్వైర్ కాదు.. ఫైటర్ అని అన్నారు. చివరకు ఐ యామ్ వాట్ ఐ యామ్ అని పెట్టేశాను’ అని అన్నారు.

Exit mobile version