NTV Telugu Site icon

‘ఓయ్ ఇడియట్’ ట్రైలర్ విడుదల

సహస్ర మూవీస్ అండ్ హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిర్మాతలు సత్తిబాబు బాబు మోటూరి, శ్రీనుబాబు పుల్లేటి నిర్మిస్తున్న చిత్రం ‘ఓయ్ ఇడియట్’. యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంక్ధర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంతో యువ దర్శకుడు వెంకట్ కడలి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ‘ఓయ్ ఇడియట్’ ట్రైలర్ ను టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మహా మాట్లాడుతూ… ”యంగ్ టీమ్ కలసి చేసిన ‘ఓయ్ ఇడియట్’ ట్రైలర్ ఫ్రెష్ గా ఉంది. టీనేజ్ లవ్ స్టోరీని స్క్రీన్ మీద అందంగా చూపించారు. ఇండస్ట్రీకి ఇలాంటి కొత్త నటీనటులు టెక్నీషియన్స్ ఎందరో రావాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించి అందరికి మంచిపేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Oye Idiot Movie Trailer 4K | Yeshwanth Yejjavarapu | Tripti Shankhdhar | Venkat Kadali | GKV