NTV Telugu Site icon

Official : అజిత్ కుమార్ ‘విదాముయార్చి’ రిలీజ్ వాయిదా

Vidaamuyarchi

Vidaamuyarchi

తమిళ స్టార్ హీరోలలో అజిత్‌ ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే  సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది.

Also Read : HHVM : హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. కానీ రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ పై అనుమానం నెలకొంది. ఆ అనుమానాలను నిజం చేస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు ‘విదాముయార్చి’ మేకర్స్. అనివార్య కారణాల వలన ఈ సినిమాను పొంగల్ కు రిలీజ్ చెయ్యట్లేదు అని అధికారకంగా ప్రకటిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఇటీవల ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా విశేష ఆదరణ లభించింది. జనవరి 10న వస్తుంది అని ఎదురుచూసిన ఫ్యాన్స్ ఇప్పుడు వాయిదా వేయడంతో నిరుత్సహంగా ఉన్నారు. కానీ ఎప్పుడు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ చేస్తుందని యూనిట్ గట్టిగా నమ్ముతోంది. దర్శకుడి మాగిజ్ ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా లేటెస్ట్ రిలీజ్ డేట్ ను ఎప్పుడు ప్రకటిస్టారో చూడాలి.