పాపులర్ టీవీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మేలో ఈ షో ప్రారంభమవుతుందని ఆతృతగా ఎదురు చూస్తున్న బుల్లితెర ప్రేక్షకులకు నిరాశ తప్పేలా లేదు. అనుకోని కారణాల వల్ల ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వాయిదా పడుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదు అవుతుండడం కూడా షో వాయిదా పడడానికి కారణమని భావిస్తున్నారు. ఈ షో ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన పలు ప్రోమోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సోషల్ మీడియాలో అభిమానులు ఈ షోను త్వరగా ప్రారంభించాలని సదరు ఛానెల్‌ను కోరుతున్నారు. కాగా మార్చి 13న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ సీజన్-5 హోస్ట్ గా జూనియర్ ఎన్టిఆర్ ను పరిచయం చేశారు. ఈ సీజన్ కు ఎన్టీఆర్ 7 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్లో 60 ఎపిసోడ్ లు ఉండబోతున్నాయట.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వాయిదా ?
