NTV Telugu Site icon

Devara :ప్రీ పోన్ అయిన ఎన్టీఆర్ ‘దేవర’.. రిలీజ్ పోస్టర్ వైరల్..

Ntr

Ntr

Devara :మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి మేకర్స్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా “ఫియర్ సాంగ్ “ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది .యూట్యూబ్ లో ఈ సాంగ్ కు రికార్డు వ్యూస్ వస్తున్నాయి.

Read Also :G. V. Prakash Kumar : యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కు ‘రాబిన్ హుడ్’ టీం స్పెషల్ బర్త్ డే విషెస్..

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఇటీవలే గోవా లో మేకర్స్ షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేసారు.ఈ షెడ్యూల్ లో కొంత టాకీ పార్ట్ ,యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించినట్లు సమాచారం.గోవా షెడ్యూల్ ముగించుకొని ఎన్టీఆర్ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ దసరా కానుకగా అక్టోబర్ 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.అయితే దేవర సినిమా ప్రీ పోన్ కానున్నట్లు బాగా వార్తలు వినిపించాయి.తాజాగా ఈ సినిమా ను ప్రీ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో దేవర సినిమాను సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే అక్టోబర్ లో రాంచరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.దేవర ప్రీపోన్ కావడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Show comments