యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ 31 గురించి ఆసక్తికరమైన వెల్లడించారు తారక్. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30ను కొరటాల స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తుండగా… నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. ఎన్టీఆర్ 30 కూడా ఆర్ఆర్ఆర్ లాగే అన్ని భాషల్లో విడుదల కానుందని తెలిపారు. ఎన్‌టిఆర్ 30 తర్వాత ప్రశాంత్ నీల్‌తో కలిసి పని చేయనున్నానని, ఎన్‌టిఆర్31 ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని, ఎన్‌టిఆర్ 30 పూర్తయిన తరువాత ఎన్టీఆర్ 31 ప్రారంభం అవుతుందని తెలిపారు తారక్. ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ గురించి చెప్పమని అడగ్గా… నేను ‘ఆర్ఆర్ఆర్’ గురించి చెబితే, రాజమౌళి ఈ ఇంటర్వ్యూ చదివి నాకోసం గొడ్డలి పట్టుకుని పరిగెత్తుకొస్తాడు అంటూ చమత్కరించాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’పైనే తారక్ దృష్టి పెట్టారు. ఇది చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇందులో రామ్ చరణ్ మరో హీరోగా నటించారు.
ఆ విషయాలు చెబితే రాజమౌళి గొడ్డలితో వస్తారు : ఎన్టీఆర్
