టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న, మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్ 2’. ఇప్పటికే ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఒక ముఖ్యమైన అప్‌డేట్‌తో సినిమాపై హైప్ మరింత పెరిగేలా చేశారు. తన పాత్ర షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్..
Also Read : Lokesh Kanagaraj : ‘కూలీ’ కోసం నా జీవితానే పక్కనపెట్టా..
తాజాగా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన భావోద్వేగాన్ని పంచుకుంటూ, సహనటుడు హృతిక్ రోషన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.. ‘సెట్‌లో హృతిక్ సర్‌తో పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఆయన ఎనర్జీ, నిబద్ధత నాకు ఎప్పుడూ ప్రేరణ. ఈ సినిమా ద్వారా ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అని తెలిపారు. అలాగే దర్శకుడు అయాన్ గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘అయాన్ ప్రేక్షకులకు ఒక పెద్ద సర్‌ప్రైజ్ ప్యాకేజీని సిద్ధం చేశారు. ఈ కథ, ఈ విజన్ ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తేలా ఉంటుంది. ఈ ప్రయాణం నాకు చాలా విషయాలు నేర్పింది. అభిమానుల ప్రేమ, చిత్ర బృందం కృషి వల్లనే ఇది సాధ్యమైంది. ఇప్పుడే కాదు, ఆగస్టు 14న మీరు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసే వరకు నేను ఎదురు చూస్తుంటాను’ అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. మొత్తనికి ఈ అప్‌డేట్‌తో ‘వార్ 2’ పై అంచనాలు మరింతగా పెరిగాయి. తెలుగు, హిందీ చిత్ర ప్రియులు ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
And It’s a wrap for #War2!
So much to take back from this one…It’s always a blast being on set with @iHrithik Sir. His energy is something I have always admired. There is so much I have learned from him on this journey of War 2.
Ayan has been amazing. He has truly set the…— Jr NTR (@tarak9999) July 7, 2025
