Site icon NTV Telugu

ఖరీదైన లంబోర్ఘినితో ఎన్టీఆర్

NTR The proud owner of India's 1st Lamborghini Urus Graphite

టాలీవుడ్ టాప్ స్టార్ ఎన్టీఆర్ తన విలువైన కారు లంబోర్ఘిని ఉరుస్‌తో కలసి పోజిచ్చాడు. తనతో పాటు హీరో శ్రీకాంత్, కాకినాడ టిడిపి ఎంపిగా పోటీచేసిన సునీల్ కుమార్ చలమలశెట్టితో కలిసి కారుముందు నిలబడి పోజులిచ్చాడు. ఇండియాలో తొలి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ యజమాని ఎన్టీఆర్ కావటం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి చేసి ఉక్రెయిన్‌ నుంచి తిరిగి రాగానే లంబోర్ఘిని డెలివరీ తీసుకున్నాడు ఎన్టీఆర్.

Read Also : హిలేరియస్ గా “101 జిల్లాల అందగాడు” ట్రైలర్

ఈ కారు డెలివరీ తీసుకునేందుకు కస్టమ్స్ డ్యూటీ క్రింద తారక్‌ 5 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ కారు 3.6 సెకన్లలో 0-100 కి.మీ… 12.8 సెకన్లలో 0-200 కి.మీ పికప్ అందుకుంటుందట. అందుబాటులో ఉన్న ఎస్ యువీ కార్లలో ఆది అత్యంత వేగవంతమైనదట. మొత్తం మీద గరిష్టంగా 305 కిలోమీటర్ల వేగాన్ని లంబోర్ఘిని అందుకుంటుదని వినికిడి.

Exit mobile version