మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ప్రకటించిన ‘అయినను పోయిరావలె హస్తినకు’ ప్రాజెక్ట్ ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ కొరటాలతో… త్రివిక్రమ్ మహేష్ తో తమ తమ ప్రాజెక్టులను అనౌన్స్ చేసుకున్నారు. అయితే తాజా సమాచారం ఏంటంటే… ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడానికి కారణం స్క్రిప్ట్ అంటున్నారు. ‘అల వైకుంఠపురం’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ ఎన్టీఆర్30 స్క్రిప్ట్ ను చాలా తేలికగా తీసుకున్నాడట. ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ ప్రకటించిన సంవత్సరం తరువాత కూడా త్రివిక్రమ్ ఫైనల్ డ్రాఫ్ట్ తో రాలేదట. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన కొన్ని రోజులకే ఎన్టీఆర్30 కూడా రిలీజ్ అయితే బాగుంటుందని అనుకున్నాడట ఎన్టీఆర్. కానీ త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ ను టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న పద్ధతి ఎన్టీఆర్ కు నచ్చలేదట. దీంతో ఈ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి స్క్రిప్ట్ విషయంలో సిన్సియర్ గా ఉండే కొరటాల శివకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరోవైపు త్రివిక్రమ్ కూడా వెంటనే మహేష్ కు స్టోరీలైన్ ను విన్పించి ఒప్పించాడట.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ కు కారణం ఇదే…?
