హీరోయిన్‌గా సెటిలౌదామని బాలీవుడ్‌కు వచ్చిన నోరా ఫతేహీని ఐటమ్ భామగా మార్చిన క్రెడిట్ టాలీవుడ్‌దే. టెంపర్‌లో ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల సాంగ్‌తో ఓవర్ నైట్ పాపులారిటి తెచ్చుకుంది. అక్కడ నుండి ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా మేకోవర్ అయ్యింది. హీరోయిన్ రోల్స్ కన్నా ఇవే ఆమెకు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి తీసుకెళ్లాయి. 4 మినిట్స్ సాంగ్‌కు కనీసం రూ. 3-5 కోట్లు తీసుకుంటోంది నోరా.
ఇప్పటి వరకు తెలుగు, హిందీలో స్పెషల్ సాంగ్స్ చేసిన నోరా ఫతేహీకి ఆఫర్స్ తగ్గాయి. మట్కా తర్వాత తెలుగులో మరో మూవీలో కనిపించలేదు. దీంతో ఇతర ఇండస్ట్రీలపై ఫోకస్ చేస్తోంది. ఆ మధ్య కేడీ ద డెవిల్‌లో చేస్తే డబుల్ మీనింగ్ లిరిక్స్, వల్గర్ స్టెప్స్ అంటూ నెటిజన్స్ మండిపడంతో నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ సీరియస్ అయ్యింది. దీంతో యూట్యూబ్ అండ్ థియేటర్స్ నుండి సాంగ్ తీసేశారు. కాస్త బ్రేక్ తీసుకున్న నోరా.. నెక్ట్స్ జైలర్2తో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జైలర్2లో ఆల్రెడీ ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది పూర్ణ. ఆ సాంగ్ కాస్త క్లాసిక్ టచ్‌తో పాటు ట్రెడిషనల్ స్మెల్ రావడంతో, నోరాను రంగ ప్రవేశం చేయించారు మేకర్స్. జైలర్‌లో తమన్నా హీరోయిన్ అండ్ ఐటమ్ గర్ల్‌గా మారిపోయి.. నువ్వు కావాలయ్యాతో కమర్షియల్ హంగులు అద్దింది. కానీ జైలర్2లో పూర్ణ డోస్ సరిపోలేదనుకున్న టీం.. నోరాతో గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు ట్రై చేస్తోంది. ఎక్స్ పోజింగ్ విషయంలో ఏ మాత్రం వెనకాడని నోరా బిందాస్ సాంగ్‌లో స్కిన్ షో చేసింది. స్టెప్పులు విషయంలో కాస్త కేర్ తీసుకున్నట్లే ఉంది. ఈ స్పెషల్ సాంగ్ నోరాను మళ్లీ బిజీ చేస్తుందేమో చూడాలి.

