Site icon NTV Telugu

నోరా ఫతేహి హాట్ డ్యాన్స్… వీడియో వైరల్

Nora Fatehi HOT dance moves to VIRAL 'One Dance'

బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ఒక అద్భుతమైన డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే. ఆమె మెలికలు చూస్తే మతి పోతుంది. తాజాగా మరో హాట్ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది ఈ బ్యూటీ. గత కొన్ని రోజులను నుంచి డ్రేక్ సాంగ్ ‘వన్ డాన్స్’కు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది. తాజాగా అదే సాంగ్ కు నోరా చేసిన డ్యాన్స్ నెట్టింట్లో హీట్ పుట్టిస్తోంది.

Read Also : లైంగిక వేధింపుల కేసులో నటుడికి విముక్తి

ఈ వీడియోలో ఆమె పింక్ బికినీ, బ్లూ షార్ట్, స్నీకర్స్ ధరించి కష్టమైన స్టెప్పులను అలవోకగా చేసేస్తోంది. “సమ్మర్ టైమ్ వైబ్స్ …” అంటూ ఈ వీడియోను పోస్ట్ చేసింది నోరా. కాగా నోరా ఫతేహి చేసిన “సత్యమేవ జయతే” చిత్రంలోని “దిల్బార్” సాంగ్, ‘బాట్ల హౌస్’ సినిమాలోని ‘ఓ సాకి సాకి’, ‘స్ట్రీట్ డాన్సర్ 3డి’లోని ‘గర్మి’ సాంగ్స్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమె సోషల్ మీడియాలో 29 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో భారీ క్రేజ్ ను కొనసాగిస్తోంది. అభిషేక్ దుధయ్య ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’లో నోరా కనిపించనుంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గన్, సోనాక్షి సిన్హా, సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

Exit mobile version