NTV Telugu Site icon

నితిన్ “పవర్ పేట” ఆగిపోయిందా ?

Nithiin Power Peta remake Cancelled

యంగ్ హీరో నితిన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “పవర్ పేట” క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రారంభానికి ముందే పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. బడ్జెట్ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. “పవర్ పేట” రెండు భాగాలుగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కాల్సి ఉంది. పైగా ఇందులో నితిన్ 60 ఏళ్ల వృద్ధుడిగా ఛాలెంజింగ్ రోల్ లో కన్పించాల్సి ఉంది. గతంలో నితిన్ “చల్ మోహన్ రంగా” చిత్రానికి దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య “పవర్ పేట” రీమేక్ కు దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.40 కోట్ల బడ్జెట్‌ను ఆయన నిర్మాతల ముందుంచారట. దీంతో నితిన్ మార్కెట్, దర్శకుడి క్యాపబిలిటీస్ వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రాజెక్టు కోసం రూ.40 కోట్లు భారీ మొత్తం బడ్జెట్ పెట్టడం రిస్క్ అని నిర్మాతలు భావించారట. దీంతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు బడ్జెట్‌ను సవరించాలి లేదంటే వేరే నిర్మాతలు ఈ ప్రాజెక్టును చేపట్టాలి. రెండూ జరగకపోతే “పవర్ పేట” మొత్తానికి నిలిపివేయబడుతుంది. ప్రస్తుతం నితిన్ “అంధాదున్” రీమేక్ “మాస్ట్రో”తో బిజీగా ఉన్నాడు.