Committee Kurrollu: తొలి రోజే దుమ్ము రేపిన ‘కమిటీ కుర్రోళ్ళు’.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారంటే?

  • తొలి రోజే దుమ్ము రేపిన ‘కమిటీ కుర్రోళ్ళు’
  • ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల
  • తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌
Nihaika Comittee Kurrollu

Nihaika Comittee Kurrollu

Niharika Konidela’s “Committee Kurrollu” Day 1 Collections: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో చ‌క్క‌గా తెర‌కెక్కించార‌ని అంద‌రూ ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్ర‌శంస‌ల‌తో పాటు సినిమాకు మంచి క‌లెక్ష‌న్స్ కూడా వ‌చ్చాయి.

Suriyas Kanguva : స్టార్ హీరో సూర్య కంగువా.. ట్రైలర్ బ్లాస్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా ?

వ‌ర‌ల్డ్ వైడ్ ఈ సినిమా తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ఇక వీకెండ్స్ అయిన‌ శ‌నివారం, ఆదివారం రోజుల్లో ఈ క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరుగుతాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం, శ్రీ లక్ష్మి, కంచరపాలెం కిషోర్, కిట్టయ్య, రమణ భార్గవ్, జబర్దస్త్ సత్తిపండు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.