Site icon NTV Telugu

Nidhhi Agerwal: ఆ సినిమాలకు ఎంతిస్తే అంత తీసుకుంటా..

Nidhhi Agerwal

Nidhhi Agerwal

Nidhhi Agerwal: సవ్యసాచి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నిధి అగర్వాల్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయినా నిధికి మాత్రం అవకాశాలను బాగానే తెచ్చిపెట్టింది. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న హాట్ బ్యూటీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఒక పక్క టాలీవుడ్ లో చేస్తూనే కోలీవుడ్ లోను స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.

Read also: Bombay High Court: మావోయిస్టు లింక్‌ల కేసులో మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నిర్దోషి

తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇండస్ట్రీ, కెరీర్ గురించి కూడా ఆమె కొన్ని బహిరంగంగా సంచళన వ్యాఖ్యలు చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “ఇండస్ట్రీలో టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చేవాళ్లు చాలా తక్కువ. అందరూ హీరోయిన్లు అందంగా ఉన్నారా లేదా? వారు అదే చూస్తారు. రాబోయే సినిమాల్లో హీరోయిన్ల పని గ్లామర్ షో చేయడమే. గ్లామర్ కోసం ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తుంటారు. అందుకే గ్లామర్ షో చేయడానికి వెనుకాడను, నో చెప్పను. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం ఇవ్వాలని ఏ దర్శకుడైనా వస్తే రెమ్యునరేషన్ డిమాండ్ చేయను. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. లేకుంటే నా మినిమమ్ అమౌంట్ ఇదే అని చెబుతాను. ఎందుకంటే పెద్ద హీరోతో సినిమా చేస్తే తర్వాత అవకాశాలు తప్పకుండా వస్తాయని నాకు తెలుసు’’ అని నిధి అగర్వాల్ తన సక్సెస్ మంత్రాన్ని వెల్లడించింది.

Exit mobile version