NTV Telugu Site icon

Thandel : వాళ్లిదరు లేకుండా నెక్ట్స్ సినిమా చేయలేనేమో అని భయం పట్టుకుంది : నాగ చైతన్య

Thandel (3)

Thandel (3)

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు ‘తండేల్’ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

Also Read : Thandel : తండేల్ ఈవెంట్ కు ‘అల్లు అర్జున్’ డుమ్మా… కారణం ఏంటంటే..?

‘తండేల్’ జాతర ఈవెంట్ లో హీరో అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ ‘ విచ్చేసిన అతిధులకు, ప్రేక్షకులకు,అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన సందీప్ రెడ్డి వంగా గారికి థాంక్. అల్లు అరవింద్, బన్నీ వాసు లేకుండా నెక్స్ట్ సినిమా ఎలా ఫినిష్ చెస్తాననే భయం పట్టుకుంది. వారు సినిమాలో అంతలా కాంట్రిబ్యుట్ చేస్తారు. గీత ఆర్ట్స్ పేరు నా కెరీర్ లో టాప్ లో వుంటుంది. తండేల్ నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ.తండేల్ రాజు కి నాకు రియల్ లైఫ్ లో చాలా డిఫరెన్స్ వుంటుంది. ఈ క్యారెక్టర్ నేను చేయగలనని నమ్మిన వాసు, చందుకి థాంక్ యూ. క్యారెక్టర్ లోకి ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వడానికి చాలా టైం ఇచ్చారు. చందు తో ఇది మూడో సినిమా. నన్ను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తాడు. సాయి పల్లవి అద్భుతమైన నటి. తనని అందరూ ఇష్టపడతారు. తను చాలా పాజిటివ్ పర్శన్. ఈ సినిమాకి ట్రూ రాక్ స్టార్ దేవి. చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు.  శ్రీకాకులం వచ్చిన మత్సకారుల కుటుంబాలకి ధన్యవాదాలు. వారి వలనే నా క్యారెక్టర్ కి ఒక ఐడియా వచ్చింది. వారికి సముద్రం తప్పితే మరొకటి తెలీదు. వారు లేకపోతే ఈ సినిమా లేదు. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఫిబ్రవరి 7 థియేటర్స్ లో దుల్లకొట్టేద్దాం’అన్నారు