ప్రముఖ దర్శకుడు, ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ రెండు వారాల పాటు అందరూ పర్శనల్ లాక్ డౌన్ పాటిస్తే మంచిది సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినా, ప్రకటించకపోయినా… దీనిని పాటించడం వల్ల డాక్టర్లకు కాస్తంత విశ్రాంతి లభిస్తుందన్నది ఆయన అభిప్రాయం. గత కొన్ని వారాలుగా కరోనా నివారణకు వాక్సినేషన్ చేస్తూ, కరోనా రోగులకు వైద్యం చేస్తూ డాక్టర్లు, వారి బృందం ఎంతో అలసిపోయారని, కనీసం వారి కోసమైనా రెండు వారాలు అందరూ వ్యక్తిగతంగా లాక్ డౌన్ పాటిస్తే మేలు అని నాగ అశ్విన్ చెబుతున్నారు. ఒక్కసారి హాస్పిటల్స్ కు వెళ్ళి చూస్తే వైద్య సిబ్బంది ఎంతగా కష్టపడుతున్నారో అర్థమౌతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మంచి మాటలను ఎంతమంది ఆచరిస్తారో చూడాలి. ప్రస్తుతం నాగ అశ్విన్ ప్రభాస్ తో ఓ సైటింఫిక్ ఫిక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నాయికగా నటించనుంది. అమితాబ్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో నాగ అశ్విన్ ఉన్నారు.
రెండువారాలు లాక్ డౌన్ అవసరమంటున్న నాగఅశ్విన్!
