Site icon NTV Telugu

సుశాంత్ కేసు… ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్

NCB arrests peddler to probe his role in drug case related to Sushant Singh Rajput's death

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో దర్యాప్తును ఎన్​సీబీ వేగవంతం చేసింది. ఈ కేసులో కీలకంగా మారిన సిద్ధార్థ్ పితానిని అరెస్ట్ చేసిన ఎన్‌సిబి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) కస్టడీని జూన్ 4 వరకు మంగళవారం పొడిగించారు. కస్టడీ పొడిగింపు ఉత్తర్వులను ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు అందించింది. దర్యాప్తులో భాగంగా, పితానిని ఎన్‌సిబి అధికారులు మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరుపరిచారు. సిద్ధార్థ్ పిథాని కాల్ రికార్డులు అతనికి డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయని రుజువు చేశాయి. దీంతో ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో దర్యాప్తు తిరిగి ప్రారంభమైంది. ఏజెన్సీ మంగళవారం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పనివాళ్ళు నీరజ్, కేశవ్‌లను ప్రశ్నించింది. ఈ ఇద్దరికీ ఇద్దరూ మాదకద్రవ్యాల రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. విచారణ సమయంలో సిద్ధార్థ్ ఇచ్చిన సమాచారంతో ఎన్‌సిబి గత రాత్రి నుండి అంధేరి వెస్ట్‌లోని లోఖండ్‌వాలా, ముంబైలోని బాంద్రాతో సహా పలు చోట్ల ఆకస్మిక దాడులు ప్రారంభించింది. ఆ దాడుల్లో ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఒకరు హరీష్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ముంబైని గడగలాడించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు, గ్యాంగ్ స్టర్, డ్రగ్ పెడ్లర్ పర్వేజ్ ఖాన్ అలియాస్ చింకు పఠాన్ కు హరీష్ క్లోజ్ అని తెలుస్తోంది. “ప్రస్తుతానికి చింకు పఠాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించే ఖాన్‌ను ఎన్‌సిబి అరెస్టు చేసింది. కాని రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అతనిపై దర్యాప్తు చేయబడుతుంది” అని ఎన్‌సిబి బృందం అధికారి తెలిపారు.

Exit mobile version