Site icon NTV Telugu

Naveen Polishetty : మణిరత్నంతో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో..

Naveen Polishety

Naveen Polishety

లవ్ స్టోరీస్‌కు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు మణిరత్నం. ఆయనకున్న స్పెషల్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కేవలం లవ్ స్టోరీస్ మాత్రమే కాకుండా, వాటిని మెసేజ్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కించడంలో ఆయనకు ఎవ్వరు సాటి రారు. అందుకే దేశంలోనే దిగ్గజ దర్శకుల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రీసెంట్‌గా ‘పొన్నియన్ సెల్వన్’ రాగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించారు. ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి ‘థగ్ లైఫ్’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు మణిరత్నం. అయితే.. తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Also Read : Pavankalyan : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌ రిలీజ్ కోసం న్యూ ప్లాన్ ..!

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో మణిరత్నం మూవీ తీయనున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ అందమైన లవ్ స్టోరీ తెరకెక్కించనున్నారని.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో రూపొందించనున్నారట.. త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ రివీల్ చేస్తారని సమాచారం. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు.. స్టోరీ ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నవీన్ మనకు కామెడీ పరంగా దగ్గరయ్యారు. తన సహజమైన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. మరి నవీన్ పొలిశెట్టికి మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుడితో పనిచేయడం ఒక మైలురాయి గా నిలుస్తుందా..? చూడాలి.

 

Exit mobile version