Site icon NTV Telugu

Karali : ‘కరాలి’ మొదలెట్టిన నవీన్ చంద్ర

Naveen Chandra

Naveen Chandra

విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి మందలపు ప్రవల్లిక సమర్పణలో నవీన్ చంద్ర, రాశీ సింగ్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా మందలపు శివకృష్ణ నిర్మిస్తున్నసినిమా ‘కరాలి’ రూపొందుతోంది. రాకేష్ పొట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, నటుడు రాజా రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరై, సాహు గారపాటి స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టగా, శ్రీహర్షిణి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత గోరంట్ల రవికుమార్, యాస్పైర్ స్పేసెస్ ఎండీ తుమాటి నరసింహా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

Also Read : Subham: సమంతకు ఓటీటీ షాక్?

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చిత్ర బృందం మాట్లాడింది. నవీన్ చంద్ర మాట్లాడుతూ… “కొత్త కథలతో సినిమాలు నిర్మించేందుకు శివకృష్ణ వంటి ధైర్యవంతులైన నిర్మాతలు ముందుకు రావాలి. ‘కరాలి’ టైటిల్‌లాగే సినిమా కూడా వైవిధ్యంగా, కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు నేను చేయని యాక్షన్ డ్రామా ఇది. కాజల్ చౌదరి ‘అనగనగా’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. మా టీమ్ అద్భుతంగా పనిచేస్తోంది. ప్రేక్షకులు, మీడియా ఎప్పటిలాగే నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమాను అందరూ ఆనందించేలా రూపొందిస్తున్నాం,” అని తెలిపారు.

Exit mobile version