న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వదంతులు, పోస్ట్‌పోన్ కానుందంటూ ప్రచారాలు షికారు చేశాయి. క్లైమాక్స్, CG వర్క్ ఫినిష్ అవలేదని రిలీజ్ ఒక వారం వాయిదా పద్దుతుందనే న్యూస్ వైరల్ గా మారాయి. అయితే ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ ముందుగా ప్రకటించిన తేదీకే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది.
సినిమా విడుదలను వాయిదా వేస్తున్నారన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు మీడియా మరియు సినీ పరిశ్రమ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపిన నేపథ్యంలో ఈ సెప్టెంబర్‌లో అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేయాల్సిందేనని నెట్‌ఫ్లిక్స్ కూడా స్పష్టం చేసింది. దాంతో ఎలాంటి వాయిదా లేకుండా పక్కా ప్రణాళికతో మేకర్స్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా రిలీజ్ కంటే ఒక రోజు ముందే సెప్టెంబర్ 23 రాత్రి వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 24న ఎనిమిది భాషల్లో గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతున్న ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

