NTV Telugu Site icon

NaniOdela2 : దసరా దర్శకుడితో నాని నెక్స్ట్ సినిమా టైటిల్ ఇదే

Ns2

Ns2

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గతేడాది నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాలు భారీ విజయం సాధించాయి. దాంతో పాటుగా  చిత్ర దర్శకులకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం తెచ్చిపెట్టాయి ఆ రెండు సినిమాలు.  ఆ జోష్ లోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ కుర్ర హీరో. నానితో దసరా సినిమాను తెరకెక్కించిన  శ్రీ‌కాంత్ ఓదెలతో మరో సినిమా  చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాగా నిలవనుంది.

Also Read : Nivinpouly : లైంగిక ఆరోపణల కేసులో స్టార్ హీరోకు క్లీన్ చిట్..

దాదాపు రూ.100 కోట్లతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు నిర్మాతగా సుధాకర్ చెరుకూరి. తాజగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. నాని ఓదెల కాంబోలో రానున్న ఈ సినిమాకు ‘ ది ప్యారడైజ్’ (THEPARADISE) టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.  నాని ఈ  సినిమాలో డ్యూయెల్ రోల్ చేయనున్నాడని  అందులో ఒక పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని  తెలుస్తోంది. ఈ సినిమా కథా నేపథ్యం 80వ దశకంలోని సికింద్రాబాద్ బ్యాడ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా భారీ, భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. నిజ‌మైన నాయ‌కుడికి ఐడెంటిటీ అవ‌స‌రం లేద‌న్న స్లోగ‌న్ ను ఈ సినిమా పోస్ట‌ర్‌ ను డిజైన్ చేశారు మేకర్స్. స్లోగన్ కు తగ్గట్టుగానే సినిమాలో చాలా వేరియేషన్స్ వుంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం నాని స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న ( HIT 3) లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతుంది.

 

Show comments