Nani Comments on Tier 1 and Tier 2 Comments: నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ లో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ‘సరిపోదా శనివారం’. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది.
Pushpa 2 : ఇండియాలోనే హయ్యెస్ట్.. ఇది సార్ పుష్ప గాడి రేంజు!!
ఈ క్రమంలో మీరు టైర్ వన్ హీరో అయ్యారనే కామెంట్ కి స్పందిస్తూ అసలు ఆ గోల నాకొద్దంటూ ఓపెన్ స్టేట్ మెంట్ పాస్ చేయడం ఆసక్తి రేపింది. నిజానికి ఈ విషయంలో సోషల్ మీడియాతో పాటు రెగ్యులర్ మీడియాలోనూ రిలీజ్ కు ముందు వరకు సినిమా బ్లాక్ బస్టర్ అయితే నాని టైర్ 1 బ్యాచ్ లోకి వచ్చేస్తాడు అని ఎనాలసిస్ లు గట్టిగానే జరిగాయి. బాక్సాఫీస్ ట్రెండ్ చూస్తుంటే అలానే కనిపిస్తోంది. అయితే ఈ గోలంతా ఎందుకు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ సార్ పేర్లు పెట్టకండి దయచేసి మీకు దండం పెడతాను ఎవరు మొదలు పెట్టారో తెలియదు, ఎందుకు మొదలెట్టారో తెలియదు నాకు సంబంధం లేని విషయం గురించి నన్ను క్వశ్చన్ అడిగితే ఎలా? మీరు క్రియేట్ చేశారు అదే ముందుకు వెళ్తోంది. అది నాకు సంబంధం లేదు నన్ను ఈ గోల నుంచి వదిలేయండి బయటికి అని కామెంట్ చేశారు. నేను బయట ఉంటాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.