Site icon NTV Telugu

విడుద‌ల‌కు సిద్ద‌మైన ‘న‌ల్ల‌మ‌ల‌’

Nallamala Movie Ready To Release Soon

నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న చిత్రం న‌ల్ల‌మ‌ల‌. అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రవి చరణ్ ‌దర్శ‌కుడు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీలోని సిద్ శ్రీ‌రామ్ పాడిన ‘ఏమున్న‌వే పిల్లా’ సాంగ్ ఇప్ప‌టికే 17 మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందని, ఆ పాట‌కు ల‌క్ష‌కు పైగా క‌వ‌ర్‌సాంగ్స్ రావ‌డం విశేషమని దర్శక నిర్మాతలు తెలిపారు.

Read Also : స్టార్స్ గెటప్ లో నిహారిక గ్యాంగ్ సందడి!

విశేషం ఏమంటే… ఈ చిత్రం నుండి విడుద‌లైన అన్ని పాట‌లు 1 మిలియ‌న్‌కి పైగా వ్యూస్ సాధించ‌డం ఆడియ‌న్స్‌లో ఈ సినిమా క్రేజ్‌ను తెలియ‌జేస్తున్నాయని వారు అన్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయని, త్వ‌ర‌లో విడుద‌ల‌ తేదీని ప్ర‌క‌టిస్తామని చెప్పారు.

Exit mobile version