Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్‌డేట్

King 100

King 100

‘కింగ్’ అక్కినేని నాగార్జున నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ పై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు రోజురోజుకూ పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.  అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సి.వి. రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ల్యాండ్‌మార్క్ చిత్రం నుంచి వచ్చే ప్రతి చిన్న అప్‌డేట్ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ “అక్కినేని ఫ్యామిలీపై మీరు చూపిస్తున్న తిరుగులేని ప్రేమకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. కింగ్ నాగార్జున బర్త్‌డే కానుకగా ఆగస్టు 29న రాబోతున్న ‘కింగ్ 100’ ఎక్సైటింగ్ గ్లింప్స్ కోసం అధికారిక అన్నపూర్ణ స్టూడియోస్ హ్యాండిల్‌ను ఫాలో అవ్వండి. మనమందరం కలిసి ఈ కింగ్ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుందాం” అని తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డీఎస్పీ అందించిన ఈ మాస్ అండ్ ఎనర్జిటిక్ బిజిఎమ్‌తో రాబోతున్న గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గ్లింప్స్ విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు అధికారిక అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో అవ్వాలని చిత్రబృందం సూచించింది.