నార్మల్‌గా మూవీస్‌లో.. ఓ సీన్ బాగా రావడం కోసం, కొంత మంది హీరోలు కానీ హీరోయిన్‌లు కానీ ఎంతైనా కష్ట పడతారు. అందులో చెంపదెబ్బ విషయంలో నిజంగా కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా అలనాటి నటి కూడా తన అనుభవాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది. 1998లో విడుదలైన ‘చంద్రలేఖ’ సినిమా అంతా చూసే ఉంటారు. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ కీలక పాత్రల్లో నటించారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మ్యూజికల్ హిట్ చిత్రంలో జరిగిన, ఓ ఆసక్తికరమైన సంఘటనను నటి ఇషా కొప్పికర్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో ఒక సీరియస్ సన్నివేశంలో నాగార్జున ఆమెను చెంప దెబ్బ కొట్టే సీన్ ఉండేదట ఈ సీన్ గురించి మాట్లాడుతూ..
Also Read : Kajol : అందం కోసం అలా చేయడంలో తప్పేం లేదు
‘అది నా రెండో సినిమా కావడంతో, సీన్ న్యాచురల్‌గా రావాలంటే నిజంగా కొట్టమని చెప్పాను. మొదట నాగార్జున సాఫ్ట్‌గా కొట్టగా సీన్‌లో ఇంపాక్ట్ రాలేదట. దీంతో 14-15 సార్లు రీటేక్‌లు తీసుకోవాల్సి వచ్చి, చివరికి నా ముఖం కందిపోయింది. సన్నివేశం పూర్తయ్యాక నాగార్జున ఎంతో బాధపడి, వెంటనే క్షమాపణలు చెప్పారు. సన్నివేశం డిమాండ్ చేస్తే ఇలాంటివి సహజమే అని సమర్థించుకున్నారు. ఈ ఘటనలో నాగార్జున ప్రొఫెషనలిజం, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎలా వ్యవహరించారో స్పష్టమవుతోంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇషా కొప్పికర్ 1997లో ‘వరప్రసాద్’ సినిమాలో అతిథి పాత్రతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రెండో సినిమాగా ‘చంద్రలేఖ’ లో నటించి, ఆ తర్వాత పలు భాషల్లో 50కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటించారు. తెలుగులో చివరిసారి 2017లో ‘కేశవ’ చిత్రంలో కనిపించారు.
