Site icon NTV Telugu

‘థ్యాంక్యూ బ్రదర్’ రిలీజ్ పోస్టర్ లాంఛ్ చేసిన నాగచైతన్య

అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ జంటగా రమేశ్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్న ‘థ్యాంక్యూ బ్రదర్’ రిలీజ్ పోస్టర్ ను అక్కినేని నాగచైతన్య తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తి కరంగా ఉందని, కొత్త కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా పట్ల తానెంతో ఆకర్షితుడైనట్లు చెబుతూ ఈ నెల 30న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానున్నట్టు తెలిపాడు చైతు. ఈ సినిమా ద్వారా దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్న రమేశ్ రాపర్తికి సినిమా యూనిట్ కి అభినందనలు తెలిపాడు చైతన్య. ఇక ఈ సినిమాకు గుణ బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్ని అందిస్తుండగా సురేశ్ రఘుతు సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించారు. అర్చన, వైవా హర్ష, అనీశ్ కురువిలా, అన్నపూర్ణ, మౌనికా రెడ్డి, ఆదర్శ్, కాదంబరి కిరణ్, సమీర్ ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రధారులు.

Exit mobile version