Site icon NTV Telugu

ప్రకాష్ రాజ్ కి చిరంజీవి ఆశీస్సులు… నాగబాబు కామెంట్స్

Naga Babu Superb Speech At Prakash Raj Press Meet

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ – ‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు అధ్యక్ష పదవి కోసం పోటీకి సిద్ధమయ్యారు. కొన్ని రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ పోటీ పడనున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగబాబు, బండ్ల గణేష్, శ్రీకాంత్, ఉత్తేజ్, సమీర్, సన, బెనర్జీ, నాగినీడు అనసూయ ఏడిద శ్రీరామ్, ప్రగతి, తనీష్ అజెయ్ తదితరులు హాజరయ్యారు.

Read Also : హీరోయిన్లతో కలిసి సినిమాను వీక్షించిన అక్షయ్…!

ఈ ప్రెస్ మీట్ లో నాగబాబు మాట్లాడుతూ ” ప్రకాష్ రాజ్ రెండు నెలల క్రితం కలసి నాకు ‘మా’ డెవలప్మెంట్ గురించి చెప్పారు. నాకు ప్రకాష్ రాజ్ సర్వీస్ చూసి ముచ్చటేసింది. ఆయన ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు అనగానే లోకల్, నాన్ లోకల్ అనే వాదన తెరమీదకు వచ్చింది. లోకల్ నాన్, లోకల్ కి ప్రమాణం ఏమిటి ? ‘మా’లో సభ్యత్వం వుంటే ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. లోకల్, నాన్ లోకల్ అనేది అర్థరహితం. గత నాలుగు సంవత్సరాలుగా మా ప్రతిష్ఠ మసక బారింది. మళ్ళీ మా ప్రతిష్ష పెరిగే విధంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి అధ్యక్షుడు అవ్వాలి. ప్రకాష్ రాజ్ కి చిరంజీవి ఆశీస్సులు వున్నాయి. ఆయన ఒక మంచి యాక్టర్… అతనికి మేము సపోర్ట్ చేస్తున్నాము” అని చెప్పుకొచ్చారు నాగబాబు.

Exit mobile version