Site icon NTV Telugu

Mrunal Thakur: సినిమా ఫెయిల్యూర్‌కి రివ్యూలే కారణం..

Mrunal

Mrunal

ఏదైనా ఒక సినిమా వచ్చిందంటే చాలు.. యూట్యూబ్ రివ్యూల, ట్విట్టర్ కామెంట్స్, ఇన్‌స్టా రీల్స్‌తో మైండ్ బ్లాక్ అంటూ ఇష్టం వచ్చిన రివ్వూ ఇస్తున్నారు. అసలు సినిమా ఎలా ఉందో తెలిసేలోపే.. ‘ఫ్లాప్’, ‘ఓవరాక్షింగ్’, ‘బోర్’ అంటూ ట్యాగ్‌లతో దండం పెట్టి ప్రేక్షకుల అభిప్రాయాలను దారి తప్పిస్తున్నారు కొంతమంది రివ్యూ మేకర్లు. ఈ ట్రెండ్‌పై ఇప్పటికే పలువురు హీరోలు, నిర్మాతలు నిప్పులు చెరిగారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఇదే విషయంపై బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

Also Read : Vishwambhara : ‘విశ్వంభర’ నుంచి బర్త్ డే సర్ప్రైజ్ – ఆషిక రంగనాథ్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా!

ఇటివల బాలీవుడ్ లో మ‌ృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ విడుదలైన మిశ్రమ స్పందన అందుకుంది. ఈ క్రమంలో మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో ఓ అభిమాని.. “నేను నెగిటివ్ రివ్యూలు చూసి ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమా చూడలేదు” అంటూ కామెంట్ చేశాడు. దీనిపై ఆమె స్పందిస్తూ.. “చాలా రివ్యూలు తప్పుదారి పట్టించేవిగా ఉంటున్నాయి. అందుకే రివ్యూలను నమ్మకుండా, మీరే సినిమా చూసి ఓ అభిప్రాయం ఏర్పరచుకోవాలి. ఒక్కోసారి సినిమా ఫెయిల్యూర్‌కి రివ్యూలే కారణం అవుతాయి” అంటూ కుండ బద్దలు కొట్టేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రివ్యూలు చూసి ప్రేక్షకులు సినిమా‌కు వస్తే.. అసలు సినిమా ఆత్మను చూడకముందే దాన్ని ఖండించేసినట్లే అవుతుంద‌ని ఇండస్ట్రీలో చాలామంది నిపుణులు కూడా చెబుతున్నారు. అయిన కూడా వారి ఆగడాలు ఆగడం లేదు. ఇక ప్రజంట్ మృణాల్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు.

 

 

 

Exit mobile version