NTV Telugu Site icon

Mr Reddy: ఆసక్తికరంగా ‘మిస్టర్ రెడ్డి’ టీజర్

Mr Reddy

Mr Reddy

టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోల్డ్ మ్యాన్ రాజా అకా టి. నరసింహారావు-టీఎన్ఆర్ నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. ఈ చిత్రానికి వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టీఎన్ఆర్‌తో పాటుగా.. మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లోని డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. చిన్నతనంలో విడిపోయిన ప్రేమ జంట.. పెద్దయ్యాక మళ్లీ ఎదురు పడితే.. మళ్లీ ఆ ప్రేమ కోసం ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో మిస్టర్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ‘మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదు.. జీవితాన్ని చివరి వరకు కలిసి పంచుకోవడం’ అంటూ చెప్పే డైలాగ్ ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటో చెప్పేస్తుంది. టీజర్ లాంచ్ ఈవెంట్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్, పట్నం సునీతా రెడ్డి, నల్లగొండ గద్దర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. టీజర్ లాంచ్ అనంతరం హీరో గోల్డ్ మ్యాన్ రాజా మాట్లాడుతూ కొత్త వాళ్లమంతా కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించాలి. మా సినిమా త్వరలోనే రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.