Site icon NTV Telugu

TG Vishwa Prasad: గబ్బు పట్టించారు.. ‘మిస్టర్ బచ్చన్’పై టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

Tg Vishwa Prasad Harish Sha

Tg Vishwa Prasad Harish Sha

Mr Bachchan producer’s sensational Comments on Harish Shankar: రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో ఉన్నంత ఊపు సినిమాలో లేదని సినిమా చూసిన ఎవరికైనా అర్ధమైపోతుంది. తాజాగా ఈ విషయం మీద నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని కామెంట్స్ చేశారు. అసలు ఈ సినిమా మీద ఒక రేంజ్ లో అంచనాలు పెంచేశారు కదా హరీష్ శంకర్ అని అడిగితే ఇప్పుడు ఇంకా సినిమా రన్ అవుతోంది కాబట్టి ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదని విశ్వప్రసాద్ అన్నారు. కొన్ని విషయాలు మిస్ ఫైర్ అయినట్టే ఈ సినిమా కూడా మిస్ ఫైర్ అయిందని అన్నారు. ఆ స్కేల్లో చేసే సినిమాకి ఉండాల్సిన బలమైన స్క్రిప్ట్ మిస్టర్ బచ్చన్ కి లేదు. తనకు మొదటి పార్ట్ బాగానే అనిపించిందని చిన్నచిన్న ఎడిట్స్ చేయాల్సి ఉంది వాటిని ట్రిమ్ చేసి కూడా రిలీజ్ చేశామని అన్నారు. సెకండ్ హాఫ్ విషయంలో నిరాశ పడ్డామని సినిమా ఇంకా నడుస్తోంది కాబట్టి ఇప్పుడే కామెంట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు.

Janhvi Kapoor: పుష్ప 2 ఐటమ్ సాంగ్ కి అడ్డుగా దేవర కాంట్రాక్ట్.. కానీ?

అలాగే మీడియాతో ఇప్పటికే ఉన్న ఇబ్బందులు చాలని ఇంకా దాన్ని కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలో ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఉంటాయి ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్ లు ఉన్నాయి, నేను లేవని చెప్పట్లేదు. కానీ వీటిని ఎక్కువగా చేసి చెప్పారు. కొన్ని ఇతర ఎఫెక్ట్స్ ని ఆధారంగా చేసుకుని వాటిని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. నేను సూపర్ స్ట్రాంగ్ గా ఉంటే నేను గొడవకి వెళ్లొచ్చు. మా దగ్గర వీక్నెస్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ఆ వీక్నెస్ లో ఉన్నప్పుడు వాటిని ఎటాక్ చేస్తుంటే అంతకు ముందు జరిగిన రచ్చ వల్ల ఇంకా ఎక్కువ జనాల్లోకి వెళ్లింది. సినిమా అంత బాడ్ మూవీ అయితే కాదు ఫైవ్ డే వీకెండ్ ఉన్న స్లాట్ దొరకడం అనేది చాలా రేర్. ఇలాంటి సమయంలో అది మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్ విషయంలో. ఒక ప్రాపర్ కామెడీ మూవీ చూస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ మూవీ చూస్తున్నప్పుడు లాజిక్ మిస్ అవ్వకూడదు.

లాజిక్ మిస్ అయినా ఎంటర్టైన్మెంట్ బాగున్నప్పుడు సినిమా ఆడుతుంది కానీ కొంతమంది ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అవుతుంది.. ఈ సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ ఇంత దారుణంగా ఇబ్బంది పడాల్సిన సినిమా అయితే కాదు. మనం చేసే పనిలో 100% కరెక్ట్ అయినప్పుడు ఎంత ఎటాకింగ్ మోడ్ లో ఉన్నా ఏమీ కాదు. కానీ మన దగ్గర వీక్నెస్ ఉన్నప్పుడు ఆ ఎటాకింగ్ రివర్స్ అవుతుంది అని అన్నారు.. సినిమాలో సాంగ్స్ కి మంచి బజ్ ఏర్పడింది. ఒక సాంగ్స్ కోసం కూడా ఆడే అవకాశాలున్నాయి. ఈ రేంజ్ లో ఫెయిల్ అవ్వకపోతే మంచి కలెక్షన్స్ వచ్చేవి. పనికట్టుకుని కొంతమంది మీడియా వాళ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ గబ్బు పట్టించారు. ఆ గబ్బు పట్టించింది మీ డైరెక్టర్ కదా అని అడిగితే అవును అని ఆయన అన్నారు. మీడియా మీద ఈ స్థాయిలో ఎటాకింగ్ మోడ్ లో ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

Exit mobile version