NTV Telugu Site icon

MrBachchan : మిస్టర్ బచ్చన్ కోసం ఆంధ్ర డిప్యూటీ సీఎం.. ఇక రచ్చ రచ్చే..

Untitled Design 2024 08 09t084159.997

Untitled Design 2024 08 09t084159.997

మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్. సేమ్ టు సేమ్ కాకుండా మూల కథను తీసుకుని మిగిలిన కథను రవితేజకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశామని దర్శకుడు ఇటీవల పలు ఇంటర్వూలలో తెలిపాడు. ఆగస్టు 15న రిలిజ్ కానున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు.

Also Read: Double Ismart: అదే జరిగితే ఆగస్టు 15 రిలీజ్ కష్టమే.. అసలేం జరిగిదంటే..?

రిలీజ్ కు వారం రోజులు మాత్రమే ఉన్న బచ్చన్ సాబ్ ప్రమోషన్స్ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్నీ కూడా నిర్వహించారు. కాగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు బచ్చన్ నిర్మాతలు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు పీపుల్స్ మీడియా సభ్యులు. ఒకవేళ పవన్ ఒకే అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ పవన్ రాకుంటే ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని మరొక ప్లాన్ వేస్తున్నారు. రవితేజకు పవన్ కు, అలాగే పీపుల్స్ నిర్మాతలకు మధ్య మంచి స్నేహపూర్వక బంధం ఉంది. అందుకోసమైన పవన్ వస్తారని అనుకుంటున్నారు యూనిట్. నేడో రేపో ప్రీ రిలీజ్ ఈవెంట్ వ్యవహారంపై క్లారిటీ రానుంది.

Show comments